schedule Friday, September 04, 2026

స్కూళ్లకు పచ్చజెండా..!

calendar_today August 31, 2021
person dharshininews
స్కూళ్లకు పచ్చజెండా..!
స్కూళ్లకు పచ్చజెండా..! - గురుకులాలకు, హాస్టళ్లకు నో - ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ దర్శిని ప్రతినిధి: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, వసతీ గృహాలు మినహయించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను యథావిధిగా సెప్టెంబర్ 1 నుండి ప్రారంభిస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని, తల్లిదండ్రులను విద్యార్థుల హాజరుపై పాఠశాలల యాజమాన్యాలు వత్తిడి చేయకూడదని మంత్రి సూచించారు. తరగతులను ప్రత్యక్ష పద్ధతిలో గాని, ఆన్లైన్ ద్వారా గాని నిర్వహించే అవకాశం స్కూల్ మేనేజ్మెంట్లే నిర్ణయించుకోవచ్చని మంత్రి తెలిపారు. విద్యార్థుల నుంచి ఎలాంటి సమ్మతి పత్రాలను కోరవద్దని స్కూల్ మేనేజ్మెంట్లను మంత్రి కోరారు. ఇప్పటికే జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని పాఠశాలల నిర్వహణ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.