schedule Saturday, July 04, 2026

ఇంటర్ వృత్తి విద్యా విద్యార్థులకు గుడ్ న్యూస్‌

calendar_today September 13, 2022
person dharshininews
ఇంటర్ వృత్తి విద్యా విద్యార్థులకు గుడ్ న్యూస్‌
ఇంటర్ వృత్తి విద్యా విద్యార్థులకు గుడ్ న్యూస్‌ - ఈనెల 21న జాబ్ మేళా - ప్రకటించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంట‌ర్ వృత్తి విద్య‌ను పూర్తిచేసిన విద్యార్థుల‌కు తాండూరు ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 21న ఇంటర్ వృత్తి విద్యా విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాజమోహన్ రావు, ఇంచార్జ్ మల్లినాథప్పలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ లో అన్ని వృత్తి విద్యాకోర్సులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఈనెల 21న సికింద్రాబాద్ లోని క‌స్తూరీబా గాంధీ వుమెన్స్ కాలేజీలో ఉదయం పారమెడికల్, మధ్యాహ్నం నాన్ పారమెడికల్ విభాగాలలో జాబ్ మేళా ఉంటుందని వెల్లడించారు. ఇందులో పాల్గొనే విద్యార్థిని, విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో జాబ్ మేళాలో పాల్గొనాలని సూచించారు.