అర్హులైన పేదలకు ఆసరా
September 13, 2022
dharshininews
అర్హులైన పేదలకు ఆసరా
- మున్సిపల్ కౌన్సిలర్ ప్రవీణ్ గౌడ్
- లబ్దిదారులకు కార్డుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన పేదలకు ఆసరా పథకాన్ని అమలు చేసి ఆదుకుంటున్నారని తాండూరు మున్సిపల్ 33వ వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం తన వార్డులో నూతనంగా ఆసరా ఫించన్ లబ్దిదారులకు మంజూరైన పత్రాలు, గుర్తింపు కార్డులను కౌన్సిలర్ ప్రవీణ్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధగా సీఎం కేసీఆర్ తెలంగాణలో ఆసరా పథకాన్ని అమలుచేస్తున్నారని అన్నారు. 57 ఏండ్ల వృద్దులకు, వికలాంగులు, ఒంటరి మహిళ, బోధకాలు, డయాలిసిస్ రోగులకు ఆసరా అందించి ఆదుకుంటున్నారని అన్నారు. అలాంటి సీఎం కేసీఆర్‌కు లబ్దిదారులు రుణపడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్, ఆర్పీ, వార్డు ప్రజలు పాల్గొన్నారు.