schedule Wednesday, September 16, 2026

పేదల పాలిట దైవం కేసీఆర్

calendar_today September 14, 2022
person dharshininews
పేదల పాలిట దైవం కేసీఆర్
పేదల పాలిట దైవం కేసీఆర్ - అర్హులందరికీ ఆసరా అందిస్తున్న సర్కారు - మున్సిపల్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ పేదల పాలిట దైవంగా మారారని తాండూరు మున్సిపల్ సీనియర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని 11వ వార్డులో ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా ఫించన్ గుర్తింపు కార్డులను కౌన్సిలర్ నీరజా బాల్ రెడ్డి, బాల్ రెడ్డిలు సంయుక్తంగా అందజేశారు. వార్డులోని ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని వి ధంగా 57 ఏండ్లకే ఆసరా ఫించన్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. కొత్తగా మంజూరు చేస్తున్న ఫించన్ తో వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మళ్లీ వాళలకు, బోధకాలు, డయాలసిస్ బాధితులకు ఆర్థిక భరోసా అందుతుందన్నారు. సంక్షేమంతో సీఎం కేసీఆర్ పేదలకు దైవంగా మారారని, రానున్న రోజులలో పేదలకు ఆయనకు అండగా నిలవాలని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ సిబ్బంది, వార్డు ప్ర‌జ‌లు పాల్గొన్నారు.