schedule Sunday, July 05, 2026

టీఆర్ఎస్ తాండూరు మండల ప్రధాన కార్యదర్శిగా రాకేష్ గౌడ్

calendar_today September 27, 2022
person dharshininews
టీఆర్ఎస్ తాండూరు మండల ప్రధాన కార్యదర్శిగా రాకేష్ గౌడ్
టీఆర్ఎస్ తాండూరు మండల ప్రధాన కార్యదర్శిగా రాకేష్ గౌడ్ - నియామక పత్రం అందజేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : టీఆర్ఎస్ పార్టీ తాండూరు మండల ప్రధాన కార్యదర్శిగా చెంగోల్ గ్రామానికి చెందిన రాకేష్ గౌడ్ నియామకం అయ్యారు. టీఆర్ఎస్ తాండూరు మండల కమిటీలో ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రధాన కార్యదర్శిగా రాకేష్ గౌడును నియమించారు. మండల కమిటీ సమక్షంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రాకేష్ గౌడుకు నియామక పత్రం అందజేశారు. తాండూరు మండలంలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టంకు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం రాకేష్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన భాధ్యతను నెరవేరుస్తానని అన్నారు. మండల ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జీ. రాందాస్, ఎంపిటిసిలా ఫోరం జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి, మహిళా కన్వీనర్ శకుంతల, అంతారం సర్పంచ్ రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లప్ప, మాజీ వైస్ ఎంపీపీ శేఖర్, నాయకులు పటేల్ ఉమా శంకర్, మైనార్టీ సెల్ నాయకులు షేక్ హాసన్ పటేల్, మండల నాయకులు పాల్గొన్నారు.