schedule Saturday, July 04, 2026

గ్రంథాల‌యాల అభివృద్ధికి చేయూత‌నివ్వండి

calendar_today October 1, 2022
person dharshininews
గ్రంథాల‌యాల అభివృద్ధికి చేయూత‌నివ్వండి
గ్రంథాల‌యాల అభివృద్ధికి చేయూత‌నివ్వండి - రాష్ట్ర చైర్మ‌న్ అయాచితం శ్రీ‌ధ‌ర్‌తో జిల్లా చైర్మ‌న్ రాజుగౌడ్ - అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికి విజ్ఞ‌ప్తి తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లాలోని గ్రంథాల‌య పురోభివృద్ధికి చేయూత‌నందించాల‌ని తెలంగాణ రాష్ట్ర గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ అయాచితం శ్రీ‌ధ‌ర్‌ను జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ రాజుగౌడ్ కోరారు. శ‌నివారం రాష్ట్ర గ్రంథాల‌య సంస్థ కార్యాల‌యంలో చైర్మ‌న్ ఆయాచితం శ్రీ‌ధ‌ర్‌ను జిల్లా చైర్మ‌న్ రాజుగౌడ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఆయ‌నను శాలువాతో స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర చైర్మ‌న్‌తో రాజుగౌడ్ జిల్లాలోని గ్రంథాలయాల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. పాఠ‌కుల‌కు మెరుగైన వ‌స‌తులు క‌ల్ప‌న‌కు, గ్రంథాల‌యాల అభివృద్ధికి తోడ్పాటు అందించాల‌ని కోరారు. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికి అవ‌కాశం క‌ల్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. త్వ‌రలోనే కొత్త గ్రంథాల‌యాల ప్రారంభోత్స‌వానికి స‌హాకారం అందించాల‌ని కోరారు. ఈ విష‌యంపై రాష్ట్ర చైర్మ‌న్ అయాచితం శ్రీ‌ధ‌ర్ సానుకూలంగా స్పందించార‌ని రాజుగౌడ్ తెలిపారు.