schedule Sunday, July 05, 2026

దసరా ఉత్సవాల విజయవంతం హర్షం

calendar_today October 7, 2022
person dharshininews
దసరా ఉత్సవాల విజయవంతం హర్షం
దసరా ఉత్సవాల విజయవంతం హర్షం - సహకరించిన అందరికి కృతజ్ఞతలు - హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయ దశమి(దసరా) సంబరాలను విజయవంతం చేయడంపై తాండూరు హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి యేడాది హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను నిర్వహించడం హిందూ ఉత్సవ సమితి ఆనవాయితీని కొనసాగిస్తోంది. ఈ యేడాది కూడ హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో పట్టణంలోని పాత తాండూరు బోనమ్మ దేవాలయం వద్ద సంబరాలను నిర్వహించారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, అన్ని రాజకీయ, కుల సంఘాల సమక్షంలో దసరా సంబరాలను విజయవంతం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. సంప్రదాయ పద్ధతిలో సంబరాలను జయప్రదం చేయడం పట్ల అందరికి కృతజ్ఞతలు తెలిపారు.