యువతకు ఆహ్వానం
October 12, 2022
dharshininews
యువతకు ఆహ్వానం
- మల్కాపూర్‌లో ఓటరు నమోదు క్యాంపు
- ఏర్పాట్లు చేసిన మాజీ ఉపసర్పంచ్ షేక్ హసన్ పటేల్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: రండి ఓటర్లుగా చేరుదాం అంటూ తాండూరు మండల యువతకు టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు, మల్కాపూర్ మాజీ ఉపసర్పంచ్ షేక్ హసన్ పటేల్ యువతను ఆహ్వానిస్తున్నారు. గురువారం మల్కాపూర్ గ్రామలో ఉచిత ఓటరు నమోదు క్యాంపు ఏర్పాటు చేసినట్లు బుధవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు ముజ్‌తబా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. మల్కాపూర్ గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా పక్కన ఉన్న షేక్ మహీన్ షాపు దగ్గర గురువారం ఉదయం 9-30 గంటల నుంచి ఓటరు నమోదు క్యాంపు ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ క్యాంపులో యువత భారీగా తరలివచ్చి ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అన్నారు. క్యాంపుకు వచ్చే యువత వారి ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకవాలని, పూర్తి వివరాలకు సెల్: 9703255342లకు సంప్రదించవచ్చని సూచించారు.