schedule Saturday, July 04, 2026

అర్హులంద‌రు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

calendar_today October 13, 2022
person dharshininews
అర్హులంద‌రు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
అర్హులంద‌రు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి - టీఆర్ఎస్ తాండూరు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్ - ఉచిత ఓట‌రు న‌మోదు క్యాంపుకు స్పంద‌న తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : 18 ఏండ్లు నిండిన వారితో పాటు అర్హులైన ప్ర‌తి ఒక్క‌రు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని టీఆర్ఎస్(బీఆర్ఎస్) తాండూరు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు, మల్కాపూర్ మాజీ ఉప సర్పంచ్ షేక్ హసన్ పటేల్ అన్నారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు ముజ్‌త‌బా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్కాపూర్ గ్రామంలో ఉచిత ఓటరు నమోదు క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులతో పాటు అర్హులైన వారికి ఓటు నమోదు అవశ్యకతను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన వారంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, ఎవరైనా తప్పులు ఉంటే సవరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోయిని నర్సింలు, వడ్ల మల్లేశం, గని కార్మిక సంఘం డైరెక్టర్ గంజి రాములు, మాల గుండప్ప, మ్యాతరి నర్సింలు, ఉల్లి నర్సింలు, మొగులప్ప, తుకారం, ఈర్షాద్ పటేల్, యువకులు తదితరులు పాల్గొన్నారు..