schedule Sunday, July 05, 2026

కట్టమైసమ్మ ఆలయానికి చేయూత

calendar_today October 16, 2022
person dharshininews
కట్టమైసమ్మ ఆలయానికి చేయూత
కట్టమైసమ్మ ఆలయానికి చేయూత - రూ. 6లక్షల విరాళం అందజేసిన విఠల్‌ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం పాతకుంట ఆదర్శనగర్‌లో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ దేవాలయం నిర్మాణానికి తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ భారీ చేయూతనందించారు. దేవాలయ చెత్తు నిర్మాణం కోసం ఏకంగా రూ. 6 లక్షల విరాళాన్ని అందజేసి దైవభక్తిని చాటుకున్నారు. ఆదివారం ఆలయ కమిటీ సభ్యులకు చైర్మన్ విఠల్ నాయక్ ఈ విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ విఠల్ నాయక్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి చెత్తు నిర్మాణం పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యంత మహిమాన్వితం కట్ట మైసమ్మ తల్లి అన్నారు. ఆదర్శనగర్ పాతకుంటలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో రూ. 6కోట్లతో పార్క్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. దీంతో పాటు రూ. 16 కోట్లతో సింధు కళాశాల నుండి చిలుక వాగు వరకు 60 ఫీట్ల రోడ్డు సైడ్ డ్రైనేజీ పనులు ప్రారంభిస్తారని, మునుగోడు ఎన్నికల తర్వాత ప్రారంభమవుతాని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్లు రాములు, నల్ల పాపయ్య ,వేణుగోపాల్, పట్నం రమేష్, సుధాకర్, రాజేష్, నర్సింహులు, కృష్ణ, నాగప్ప, సుధాకర్, ఇంజనీర్ గోపాలకృష్ణ, ఆలయ పూజారి రాములు తదితరులు పాల్గొన్నారు.