schedule Friday, September 18, 2026

భూ అక్రమ కేసులను పరిష్కరించాలి

calendar_today October 17, 2022
person dharshininews
భూ అక్రమ కేసులను పరిష్కరించాలి
భూ అక్రమ కేసులను పరిష్కరించాలి - యాలాల మండలం బెన్నూరు రైతుల డిమాండ్ - తహసీల్దార్‌ కార్యాయలం ముందు దర్నా తాండూరు, దర్శిని ప్రతినిధి: భూ అక్రమ కేసులను పరిష్కరించాలని యాలాల మండలం బెన్నూరు గ్రామ రైతులు డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిని దృష్టిలో ఉంచుకుని రైతులు కార్యాలయం ముందు దర్నాకు దిగారు. ఈ సందర్బంగా రైతులు నినాదాలతో హోరెత్తించారు. గత కొన్నేండ్లుగా గ్రామంలో భూ అక్రమ కేసు కొనసాగుతుందని, దీనిని పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సమస్యను పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ గోవిందమ్మను కలిసి వినతిపత్రం అందజేశారు. రైతుల దర్నాకు మండలంలోని వివిధ గ్రామాల రైతులు మద్దతు తెలిపారు.