schedule Sunday, July 05, 2026

దూకుడుగా తాండూరు అభివృద్ధి

calendar_today October 19, 2022
person dharshininews
దూకుడుగా తాండూరు అభివృద్ధి
దూకుడుగా తాండూరు అభివృద్ధి - రోడ్డు విస్తరణతో రూపు రేఖలు మార్పుకు - సహకరిస్తున్న అందరికి కృతజ్ఞతలు - తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు అభివృద్దిలో దూకుడు పెంచుతామని, రోడ్ల విస్తరణతో రూపు రేఖలు మార్చేందుకు కృషి చేయడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు పట్టణంలో నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. బుధవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు రూపురేఖలు మారుస్తామని గతంలో ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. ఇచ్చిన హామీ మేరకు తాండూరు - చించొల్లి రోడ్డును నేషనల్ హైవేగా మార్చడం జరుగుతుందన్నారు. రోడ్డు విస్తరణలో ప్రజలు స్వచ్ఛందంగా దుకాణాలను, ఆవాసాలను కూల్చివేతకు సమం వాకరించడం అభినందనీయమన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహాకారంతో ముందుకు సాగుతామని అన్నారు. అదేవిధంగా తాండూరులో కాలుష్య నియంత్రణకు దృష్టిసారించడం జరుగుతుందని, త్వరలోనే దీన్నిపై కార్యాచరణ చేపడుతామని అన్నారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ . పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారీ తదితరులు ఉన్నారు.