schedule Sunday, July 05, 2026

ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం

calendar_today October 31, 2022
person dharshininews
ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం
ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం - చైతన్య కళాశాల విద్యార్థుల ర్యాలీ - ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు, అద్యాపకులు తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని సోమవారం తాండూరు చైతన్య జూనియర్ కళాశాలలో జాతీయ ఐక్యత వేడుకలను నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో విద్యార్థులు సమైక్య ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ సమరసత సమైక్యతకు మారుపేరుగా నిలిచి 545 సంస్థానాలను భారతదేశంలో కలుపుటకు పటేల్ కృషి చేశారని తెలిపారు. సమైక్య భారతదేశానికి శ్రమించిన వల్లభాయ్ పటేల్ దేశ తొలి హోం శాఖ మంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలు చేశారని పేర్కొన్నారు. పటేల్ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం అక్టోబర్ 31 జాతీయ ఐక్యత దినోత్సవం పేరుతో ఉత్సవాలు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ‘‘దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.