schedule Sunday, July 05, 2026

ఈడబ్ల్యూఎస్ కోటా రాజ్యాంగ విరుద్ధం

calendar_today November 7, 2022
person dharshininews
ఈడబ్ల్యూఎస్ కోటా రాజ్యాంగ విరుద్ధం
ఈడబ్ల్యూఎస్ కోటా రాజ్యాంగ విరుద్ధం - బీసీలకు అన్యాయం చేసేందుకే బీజేపీ కుట్ర - వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్క చైర్మన్ రాజుగౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: బీసీలకు అన్యాయం చేస్తూ అగ్రవర్ణాల వారికి ఈడబ్ల్యూఎస్ కింద కోటా కల్పించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లకు సుప్రీం కోర్టు ఆమోదించడంపై రాజుగౌడ్ స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా 103వ రాజ్యాంగ సవరణను తీసుకవచ్చిందన్నారు. దీనికి సుప్రీం కోర్టు ఆమోదం తెలపడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటాతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. బీసీలకు అన్యాయం చేసేందుకే బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బీసీల కుల గణనపై స్పష్టత ఇవ్వని కేంద్రం, రాజ్యాంగా విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ కోటాను తెరపైకి తెచ్చిందన్నారు. అందరికి 50 శాతం రిజర్వేషన్ మించకూడదని ఉన్న నియమాన్ని అతిక్రమించడం దుర్మార్గం అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను మినహాయిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తీవ్ర అలజడికి కారణమవుతోందన్నారు. దీని ద్వారా వ్యాప్తంగా దేశ కేంద్రానికి వ్యతిరేకంగా బీసీలు ఉద్యమించే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఇప్పటికైనా ఈడబ్ల్యూఎస్ కోటా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.