schedule Friday, September 18, 2026

తాండూరు ప్రజలు బాగున్నారా..!

calendar_today November 10, 2022
person dharshininews
తాండూరు ప్రజలు బాగున్నారా..!
తాండూరు ప్రజలు బాగున్నారా..! - నేతలతో ఆరా తీసిన ఎంపీ రంజిత్ రెడ్డి - ఎంపీ రంజిత్ రెడ్డిని కలిసిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రజలు బాగున్నారా.. అంటూ చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆరా తీశారు. కాలుకు గాయమై కోలుకున్న ఎంపీ రంజిత్ రెడ్డిని గురువారం తాండూరు టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, నాయకులు మసూద్ లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆరోగ్యంగా కోలుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఎంపీ రంజిత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు ప్రజలు బాగున్నారా అంటూ ఆరా తీశారు. అభివృద్ధి, రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వీలు చూసుకుని తాండూరుకు వస్తానని చెప్పినట్లు పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్ తెలిపారు. ఎంపీ రంజిత్ రెడ్డి ఆరోగ్యంగా కోలుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తాండూరు ప్రజలపై ఎంపీ రంజిత్ రెడ్డికి ఉన్న అభిమానం అభినందనీయమన్నారు.