schedule Thursday, September 17, 2026

కర్నూలు చేరిన అయ్యప్ప స్వాములు

calendar_today November 14, 2022
person dharshininews
కర్నూలు చేరిన అయ్యప్ప స్వాములు
కర్నూలు చేరిన అయ్యప్ప స్వాములు - సూర్యభగవాన్ దేవాలయం పడిపూజలో నామస్మరణ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నుంచి శబరి వరకు పాదయాత్రగా బయల్దేరి వెళ్లిన అయ్యప్ప స్వాములు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చేరుకున్నారు. ఈనెల 7వ తేదిన తాండూరు నుంచి గురు స్వాములు గోపాల్, నర్సింలు గౌడ్, బషీరాబాద్ నుంచి గురుస్వామి సాయిలుగౌడ్, కరణ్ కోట్ నుంచి గురుస్వామి జంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో 32 మంది అయ్యప్ప స్వాములు పాదయాత్రగా శబరి బయల్దేరిన విషయం తెలిసిందే. సోమవారం స్వాములు కర్నూలుకు చేరుకుని అక్కడి సూర్యభగవాన్ దేవాలయంలో సేద తీరారు. దేవాలయంలో నిర్వహించిన మహాపడి పూజలో స్వాములు పాల్గొని అయ్యప్ప నామస్మరణ చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం అక్కడి నుంచి తిరిగి యాత్ర కొనసాగిస్తామని గురుస్వాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు వరాల శ్రీనివాస్ రెడ్డి, గంగాదర్, చెంగోలు రాములు, కిరణ్, పోచయ్య, సూర్యకాంత్, రమేష్, ప్రణయ్, లడ్డు, శ్రీధర్, రాజు తదితరులు ఉన్నారు.