ఉన్నతమైన భవిష్యత్తుపైనే దృష్టి
November 16, 2022
dharshininews
ఉన్నతమైన భవిష్యత్తుపైనే దృష్టి
- చెడు అలవాట్లకు బానిస కావద్దు
- తాండూరు డిఎస్పీ జీ శేఖర్ గౌడ్
- ఉత్సహాంగా పీపుల్స్ ఫ్రెషర్స్ డే
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి విద్యార్థి ఉన్నత మైన భవిష్యత్తును నిర్మించుకోవడంలోనే దృష్టి సారించాలని తాండూరు డీఎస్సీ జీ.శేఖర్ గౌడ్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు స్థానిక ఎంపీటీ ఫంక్షన్ హాల్లో ఫ్రెషర్స్ డే వేడుకలను ఉత్సహాంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్నింట్లో క్రమశిక్షణతో మెలగాలన్నారు. ఉన్నతమైన భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని, దానికోసం నిరంతరం శ్రమించాలన్నారు. చెడు అలవాట్లకు బానిస కావద్దని సూచించారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని, కళాశాలకు.. తల్లిదండ్రులకు నుంచి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. మరోవైపు ఫ్రెషర్స్ డే సందర్భంగా కళాశాల విద్యార్థులు పలు నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ ఉత్తమ్ చంద్, ప్రిన్సిపల్ సత్యానంద్ కుమార్, పాలక మండలి సభ్యులు ధారాసింగ్, జనార్ధన్ రెడ్డి, నర్సింలు, ఆధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.