schedule Sunday, July 05, 2026

బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధం

calendar_today November 19, 2022
person dharshininews
బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధం
బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధం - పబ్లిక్ టాయ్‌లెట్లను వినియోగించాలి - ప్రజలకు మున్సిపల్ అధికారుల అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన నిషేధంలో ఉందని, దీనిని ఎవ్వరు అతిక్రమించరాదని అధికారులు సూచించారు. శనివారం వరల్డ్ టాయ్‌లెట్‌ డే పురస్కరించుకుని తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలకు బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధంపై అవగాహన కల్పించారు. బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేయకూడదని పబ్లిక్ టాయిలెట్స్ వాడాలని సూచించారు. బహిరంగా ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయడం ద్వారా దుర్వాసన వెదజల్లుతోందని అన్నారు. దుర్గందంతో పాటు రోగాల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. కావున ప్రజలు పట్టణ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ నీరటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.