schedule Friday, September 18, 2026

త్వరలోనే తాండూరుకు సబ్ కోర్టు..!

calendar_today November 21, 2022
person dharshininews
త్వరలోనే తాండూరుకు సబ్ కోర్టు..!
త్వరలోనే తాండూరుకు సబ్ కోర్టు..! - ఎమ్మెల్యేపై పైలెట్ రోహిత్ రెడ్డి - హర్షం వ్యక్తం చేసిన బార్ అసోసియేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి: త్వరలోనే తాండూరుకు సబ్ కోర్టు మంజూరు కాబోతుందని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తరువాత మొదటి సారి తాండూరుకు వచ్చిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని తాండూరు బార్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూరులో సబ్ కోర్టులేక గత కొన్ని రోజుల నుంచి న్యాయవాదులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కక్షిదారులు కూడ అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉందన్నారు. అనంతరం భద్రేశ్వర చౌరస్తాలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే తాండూరుకు సబ్ కోర్టు మంజూరు కాబోతుందని ప్రకటించారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన ప్రకటనపై తాండూరు అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ తరుపున న్యాయవాదులు కె.గోపాల్, నరేందర్ రెడ్డి, ఫరీద్, జిలాని, మహిళ న్యాయవాది అనిత తదితరులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.