schedule Saturday, September 05, 2026

మంత్రి మల్లారెడ్డి ఇంటిపై మెరుపు దాడులు

calendar_today November 22, 2022
person dharshininews
మంత్రి మల్లారెడ్డి ఇంటిపై మెరుపు దాడులు
మంత్రి మల్లారెడ్డి ఇంటిపై మెరుపు దాడులు - 50 చోట్ల ఐటీ శాఖ అధికారుల సోదాలు - కూతురు, కుమారు, అల్లుడు ఇళ్లలో కూడ హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: రాష్ట్రానికి చెందిన మంత్రి మల్లారెడ్డి ఇంటిపై మెరుపు దాడులు జరుగుతున్నాయి. ఐటీశాఖకు చెందిన మొత్తం 50 బృందాలు.. 50 చోట్ల తనిఖీలు చేపడుతున్నాయి. మంగళవారం తెల్లవారు జాము నుంచి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని మల్లారెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తున్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కొంపల్లిలోని విల్లాలో నివాసముంటున్న కుమారుడు మహేందర్ రెడ్డి నివాసంలో కూడ ఈ బృందాలు దాడులు కొనసాగిస్తున్నాయి. మల్లారెడ్డి కూతురు కొడుకుతో పాటు కూతురు, అల్లుడు, మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాల్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏక కాలంలో ఐటీశాఖ అధికారులు మెరుపు దాడులు చేపట్టం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈదాడులు ఎందుకు నిర్వహిస్తున్నారనేది కూడ అధికారులు స్పష్టంగా వెల్లడించడం లేదు.