కసాయి నాగుపాము..!
November 25, 2022
dharshininews
కసాయి నాగుపాము..!
- మూడు కుక్క పిల్లలపై కాటు
- తల్లీ కుక్క పోరాడినా దక్కని ప్రాణాలు
- కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
తాండూరు, దర్శిని ప్రతినిధి: జంతువుల మధ్య వైరం ఉండడం సర్వ సాధారణం. కొన్ని సార్లు అవి జాతి వైరాన్ని ఇతర జంతువులతో స్నేహంగా మెలిగి అందరికి ఆదర్శపరుస్తాయి.. మనసును ఆహ్లదపరుస్తాయి. కాని వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఓ కసాయి నాగుపాము కుక్క పిల్లలపై పంజా విసరడం కోపాన్ని తెప్పిస్తుంది. తన కాలకూట విష దంతాలతో ఏకంగా మూడు కుక్కలపై కాటేసి అంతమొందించింది. పక్కన ఉన్న తల్లీ కుక్క నాగుపాముపై ఎదురుదాడికి దిగిన తన పిల్లలను కాపాడుకోలేకపోయింది. వివరాల్లోకి వెళితే... బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామంలో ఓ కుక్క ఇటీవలే మూడు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. ఓ చిన్న కుటీరంలో ఆవాసాన్ని ఏర్పరుచుకుని అందులో పిల్లలతో కలిసి ఉంటోంది. కొద్దిసేపు అలా తల్లికుక్క బయటకు వెళ్లగానే ఎక్కడి నుంచో వచ్చిన ఓ భారీ నాగుపాము కుక్క పిల్లలపై విరుచుకుపడింది. ఒకదానిపై.. మరొకదానిపై దాడి చేసుకుంటూ అంతం చేసుకుంటూ పోయింది. అంతలోనే తల్లి కుక్క అక్కడికి చేరుకుని పాముతో ఎదురుదాడికి సిద్దపడినా ఫలితం లేకుండా పోయింది. దాదాపు గంట పాటు పాము కుక్క పిల్లలపై దాడి చేసింది. కుటీరంలో ఉన్న కుక్క పిల్లను పాము తన పంటితో బయటకు లాక్కొచ్చి మరీ కాటేసింది. స్థానికులు తీసిన వీడియో అందరిని కంటతడి పెట్టిస్తోంది.
[video width="704" height="1280" mp4="https://dharshininews.com/wp-content/uploads/2022/11/Project-Name.mp4"][/video]