ఇంచార్జ్ అధికారానికి తెర..!
November 26, 2022
dharshininews
ఇంచార్జ్ అధికారానికి తెర..!
- తాండూరు మున్సిపల్ కమీషనర్‌గా అర్షిత్ కుమార్
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఇంచార్జ్ కమీషనర్ అధికారానికి తెరపడబోతుంది. ఏడాదిన్నరకుపైగా మున్సిపల్‌లో పూర్తి స్థాయి కమీషనర్ లేక ఇంచార్జ్ కమీషనర్ ద్వారా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా మున్సిపల్ నూతన కమీషనర్‌ను ప్రభుత్వం నియమించింది. కొత్త కమీషనర్‌గా అర్షిత్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జోగిపేట్ మున్సిపల్ కమీనర్‌గా పనిచేసిన అర్షిత్ కుమార్ ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఉన్నారు. ఆయనను తాండూరు మున్సిపల్ కమీషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే గతంలో తాండూరు మున్సిపల్ కమీషనర్‌గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి అనారోగ్య కారణాలతో ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్‌కు మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ బాధ్యతలను అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏడాదిన్నరకు పైగా ఆర్డీఓ అశోక్ కుమార్ ఇంచార్జ్ కమీషనర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు కూడ పరిగి కమీషనర్‌కు ఇంచార్జ్ బాధ్యతలతోనే మున్సిపల్ వ్యవహారాలు కొనసాగాయి. నూతనంగా నియామకమైన అర్షిత్ కుమార్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికైనా పూర్తి స్థాయి కమీషనర్ బాధ్యతలతో మున్సిపల్ గాఢిన పడుతుందని పట్టణ వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.