schedule Sunday, July 05, 2026

ఫలించిన బీసీల పోరాటం..!

calendar_today November 27, 2022
person dharshininews
ఫలించిన బీసీల పోరాటం..!
ఫలించిన బీసీల పోరాటం..! - బీసీ భవన్ కు నిధుల మంజూరు అభినందనీయం - నిధుల కేటాయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు - బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ భవన్ ఏర్పాటు కోసం తాండూరు బీసీలు చేస్తున్న పోరాటం ఫలిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తాండూరు నియోజకవర్గానికి రూ.134 కోట్ల సీడీఎఫ్‌ నిధులు మంజూరు చేయడం.. అందులో బీసీ భవన్ కు రూ. 2కోట్లు కేటాయించడంపై ఆదివారం ఆయన ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. నిధుల మంజూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషి చేయడం అభినందనీయమన్నారు. గత మూడు సంవత్సరాల క్రితం అన్ని రాజకీయ పార్టీల నేతలతో కలిసి బీసీ సమీకృత భవనం కోసం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించడం జరిగిందని గుర్తుచేశారు. అప్పుడు ఇచ్చిన హమీ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సీడీఎఫ్‌ నిధుల్లో బీసీ భవను నిధులు కేటాయించడం శుభపరిణామం అన్నారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరగానే భూమిని పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.