schedule Saturday, July 04, 2026

ఖాతాదారులకు గుడ్‌ న్యూస్..!

calendar_today November 28, 2022
person dharshininews
ఖాతాదారులకు గుడ్‌ న్యూస్..!
ఖాతాదారులకు గుడ్‌ న్యూస్..! - జీరో అకౌంట్‌ తెరిచేందుకు మళ్లీ చాన్స్‌ - రెండో దశ జన్‌ధన్‌తో మరిన్ని ప్రయోజనాలు దర్శిని డెస్క్‌: జీరో అకౌంట్‌లు తెరవాలనుకునే ఖాతాదారుకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పబోతోంది. గతంలో ప్రారంభించిన జనధన్‌ ఖాతల రెండో దశను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటివరకు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన మొదటి దశలో ప్రభుత్వం 47 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిచింది. ఈ ఖాతాల్లో దాదాపు 1.75 లక్షల కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఈ డబ్బును ఆర్థిక ఆస్తులతో లింక్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశకు పూర్తిగా భిన్నంగా రెండో దశను కొనసాగించాలని కసరత్తు చేస్తుంది. సామాన్య ప్రజలను పెట్టుబడితో అనుసంధానం చేయాలని భావిస్తోంది. ఈ విధానంతో పెట్టుబడి దారులు లబ్దిపొందే అస్కారం ఉండడంతో ఆదిశగా చర్యలను చేపడుతోంది. అంటే రానున్న కాలంలో జన్ ధన్ ఖాతాదారులను పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన రెండో దశలో బ్యాంకు ఖాతాదారులను ఆర్థిక ఆస్తులతో అనుసంధానించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ప్రస్తుతం కోసం సెబీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇది త్వరలో అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన రెండవ దశను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఎక్కడైనా జీరో అకౌంట్ తెరవొచ్చు సామాన్య ప్రజలలో బ్యాంకింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద మీరు జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరవవచ్చు. ఇది కాకుండా మీరు ఏ బ్యాంకులోనైనా ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాను తెరవడానికి మీరు మీ సమీపంలోని బ్యాంకుకు వెళ్లి ఫారమ్‌ను సమర్పించాలి. భారతదేశంలో నివసించే పౌరులు ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు. ఖాతా తెరిచే వ్యక్తి వయస్సు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. దేశంలోని కోట్లాది మంది కస్టమర్లు దీని ప్రయోజనం పొందనున్నారు. దీనిపై త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.