schedule Sunday, July 05, 2026

ఎమ్మెల్యే కృషితో వార్డులకు మహర్దశ

calendar_today November 30, 2022
person dharshininews
ఎమ్మెల్యే కృషితో వార్డులకు మహర్దశ
ఎమ్మెల్యే కృషితో వార్డులకు మహర్దశ - రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఈర్షాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కృషితో తాండూరు మున్సిపల్ పరిధిలోని వార్డులకు మహర్దశ రాబోతుందని టీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ యువనాయకులు ఈర్షాద్ అన్నారు. తాండూరుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సాధించిన రూ. 134 కోట్లలో మున్సిపల్ లోని 36 వార్డులకు రూ. 36 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పట్టణంలోని 7వ వార్డుకు కూడ రూ. 1 కోటి నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఈర్షాద్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే సహాకారంతో వార్డుకు కేటాయించిన నిధులతో సమస్యలు తొలగిపోతాయని, పార్టీలకతీతంగా మున్సిపల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దే ఘనత ఎమ్మెల్యేకు దక్కుతుందన్నారు. ఆయన చేపట్టే అభివృద్ధితో పట్టణ ప్రజలు వెన్నంటి ఉండి ఆశీర్వదిస్తారని అన్నారు.