schedule Sunday, July 05, 2026

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

calendar_today November 30, 2022
person dharshininews
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం - సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం - వెంటనే రైతు సమస్యలను పరిష్కరించాలి - నియోజకవర్గ ధర్నాలో కాంగ్రెస్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతన్న సంక్షేమానికి పోరాటడం చేయడమే కాంగ్రెస్ ధ్యేయమని ఆ పార్టీ తాండూరు నియోజకవర్గ నేతలు పేర్కొన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, సీనియర్ నాయకులు జనార్ధన్ రెడ్డి, ఉత్తమ్ చంద్, ఎంఏ అలీం, మండల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంత సమయం తరువాత తాండూరు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. అనంతరం పలువురు నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్, రైతు రుణమాఫీ, రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలను ప్రవేశ పెట్టి అందులో రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. రైతులను వేధిస్తున్న సర్కారుకు ఉసురు తగిలి కూలిపోవడం ఖాయమన్నారు. రైతుల సంక్షేమానికి పోరాడం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు డిక్లరేషన్ ను అనులు చేస్తామన్నారు. రైతుల అభివృద్ధికి పథకాలను పకడ్బందీగా అమలు చేయస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, ఎస్ఎస్ఎయూఐ, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు