schedule Sunday, September 06, 2026

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం

calendar_today December 2, 2022
person dharshininews
సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం
సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం - ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి - లబ్దిదారులకు ఎల్‌ఓసీల అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి: సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరంగా మారిందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. సీఎంఆర్ఎఫ్ పథకం కింద తాండూరు పట్టణానికి చెందిన దత్తురావుకు రూ. 2 లక్షలు, యాలాల మండలానికి చెందిన జనార్ధన్ రెడ్డికి రూ.60 వేలు, బషీరాబాద్ మండలానికి చెందిన వెంకటేశ్వర్ కు రూ. 60 వేలు, మరో వ్యక్తికి రూ. 55 వేలు మంజూరయ్యాయి. శుక్రవారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు ఎలసీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతో మంది పేదల ఆరోగ్యాలకు భరోసా కల్పించిందని.. కల్పిస్తోందని... అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కేశవరావు, శ్రీనివాస్ గౌడ్, అశోక్, హరీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.