schedule Thursday, September 17, 2026

మల్లికార్జున ఖర్గేను కలిసిన బోయ అశోక్ కుమార్

calendar_today December 11, 2022
person dharshininews
మల్లికార్జున ఖర్గేను కలిసిన బోయ అశోక్ కుమార్
మల్లికార్జున ఖర్గేను కలిసిన బోయ అశోక్ కుమార్ - ఎఐసీసీ కర్ణాటక ఇంచార్జ్ శ్రీధర్ బాబును కూడ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు బోయ అశోక్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివారం కర్ణాటక రాష్ట్రం కల్బుర్గిలోని ఆయన నివాసంలో మల్లికార్జున ఖర్గేను అశోక్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఆయన కుమారుడు, ఏఐసీసీ కర్ణాటక ఇంచార్జ్, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును, తెలంగాణ మీడియా ఇంచార్జ్ చైతన్ గౌర్లను కూడ కల్బుర్గి ఎయిర్ పోర్ట్ లో కలిశారు. ఈ సందర్భంగా వారి సూచనల మేరకు కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని బోయ అశోక్ కుమార్ తెలిపారు.