schedule Thursday, September 17, 2026

పనిచేసే నాయకులకు గుర్తింపు

calendar_today December 12, 2022
person dharshininews
పనిచేసే నాయకులకు గుర్తింపు
పనిచేసే నాయకులకు గుర్తింపు - ధారాసింగ్‌కు పదవి హర్షణీయం - సన్మానించిన కలాల్ చంద్రశేఖర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: పనిచేసే నాయకులకు కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పటికైనా గుర్తింపు వస్తుందని ఆ పార్టీ యాలాల మండల యువ నాయకులు, ఆర్టీఐ రక్షణ చట్టం జిల్లా అధ్యక్షులు, గౌడ సంఘం వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు కలాల్ చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్ యాదవ్‌కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం ధారాసింగ్‌ను పార్టీ సీనీయర్ నాయకులు ఉత్తమ్ చంద్ సమక్షంలో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ తాండూరు ప్రాంతానికి చెందిన పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్‌కు టీపీసీసీ జనరల్ సెక్రటరి బాధ్యతలు అప్పగించడం హర్షణీయమన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గుర్తిస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోని బలోపేతం చేయడంలో ఎం. రమేష్‌ మహారాజ్, ధారాసింగ్‌తో పాటు సీనీయర్ నాయకులకు తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సిరెడ్డి, పెద్దేముల్ ఎంపీటీసీ నరసింహులు, షేక్ ముస్తఫా, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.