schedule Saturday, July 04, 2026

రెచ్చిపోతున్న దొంగలు..!

calendar_today December 14, 2022
person dharshininews
రెచ్చిపోతున్న దొంగలు..!
రెచ్చిపోతున్న దొంగలు..! - మహిళ ఇంట్లో రూ. 35వేలు, బంగారం ఆవరణ - మరో ఘటనలో చైన్ స్నాచింగ్ చేసిన దుండగులు - ఎన్టీఆర్ నగర్లో వారంలో రెండు సంఘటనలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రాంతంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగ తనాలతో భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం తాండూరు మున్సిపల్ పరిధి ఎన్టీఆర్ నగర్లో చోటు చేసుకున్న సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ఎన్టీఆర్ కాలనీలో గంజి లక్ష్మి అనే మహిళ వైలరింగ్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తుంది. మంగళవారం ఆమె ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చొరబడ్డారు. పని ముగించుకు ఇంటికి వచ్చిన ఆమెకు ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడి కనిపించాయి. ఇంట్లో ఉన్న బీరువా తాళం పగుల గొట్టి అందులో ఉన్న దాదాపు రూ. 35 వేల నగదుతో పాటు కష్టపడి దాచుకున్న సొమ్ముతో ఇష్టపడి కొన్ని తులం బంగారం ఆభరణాన్ని ఎత్తుకెళ్లారు. మొదట్లో తెలిసిన వారు ఎవరైనా చేశారని అనుమానంతో స్థానికంగా విచారించిన చివరకు దొంగలు చేసిన పనే అని ఆందోళనకు గురయ్యారు. రాత్రి పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎన్టీఆర్ కాలనీలో జరిగిన చోరీపై స్థానికులు గత వారం జరిగిన మరో దొంగతనాన్ని గుర్తుచేశారు. కాలనీకి చెందిన చంద్రకళ అనే మహిళ మెడలో మంచి గుర్తుతెలియని వైన్ స్నాచర్లు గొలుసు ఎత్తుకెళ్లారని వాపోతున్నారు. వరుస చోరీలతో దొంగలు రెచ్చిపోతుండడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కాలనీలో చోరీలు జరగకుండా పోలీసు శాఖ అధికారులు దృష్టిసారించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.