schedule Saturday, July 04, 2026

లంచంను గుట్టుక్కు మింగిన ఎస్‌ఐ

calendar_today December 14, 2022
person dharshininews
లంచంను గుట్టుక్కు మింగిన ఎస్‌ఐ
లంచంను గుట్టుక్కు మింగిన ఎస్‌ఐ - కక్కించేందుకు యత్నించిన విజిలెన్స్‌ అధికారులు - వీడియోలు తీసిన స్థానికులు, సోషల్ మీడియాలో వైరల్‌ దర్శిని డెస్క్‌ : ప్రజలను కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న ఎస్ఐ అతను. కాని గేదెల దొంగతనం కేసును పరిష్కరించేందుకు లంచం మేశాడు. విజిలెన్స్‌ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకునే క్రమంలో నోట్లను గుటుక్కు మంటూ నోట్లో వేసుకుని కుక్కేసుకున్నాడు. స్థానికులు తీసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే... హర్యానాలోని ఫరీదాబాద్‌లో సుభ్నత్‌ అనే వ్యక్తి తన గేదెను దొంగలించారంటూ ఫిర్యాదు చేసేందుకు ఇటీవల పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు. న్యాయం జరగాలంటే రూ.10 వేలు ఇవ్వాలంటూ ఫరీదాబాద్‌ ఎస్సై మహేంద్ర ఉలా డిమాండ్‌ చేశాడు. సుభ్నత్‌ ఇప్పటికే రూ.6 వేలు ఇవ్వగా.. మరో రూ.4 వేలు ఇస్తేనే కేసును టేకప్‌ చేస్తానని ఎస్సై షరతు విధించాడు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఓ పోలీస్‌ అధికారి. ఫరీదాబాద్‌కు చెందిన ఒక పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో నోట్లో చెయ్యిపెట్టి డబ్బులను తీసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత ఎస్సైని తమ వాహనంలో ఎక్కించుకొని వెళ్లిపోయారు. ఈ తతంగాన్నంతా అక్కడున్న వారు సెల్‌ఫోన్లలో బంధించారు. సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. A police sub-inspector in #Faridabad, #Haryana swallowed currency notes, to avoid being trapped by the vigilance team. Reportedly, the cop took a bribe from a person in exchange for initiating action on his complaint of buffalo theft.#SubInspector #MahenderPal #ViralVideo pic.twitter.com/oK3ZIIP2r3 — Hate Detector 🔍 (@HateDetectors) December 13, 2022