schedule Saturday, July 04, 2026

రాజు వేటకు వెళ్లి..!

calendar_today December 15, 2022
person dharshininews
రాజు వేటకు వెళ్లి..!
రాజు వేటకు వెళ్లి..! - భారీ బండరాళ్ల మద్య తలక్రిందులు - 40 గంటలు పాటు నరక యాతన - అధికారుల రిస్క్యూ ఆపరేషన్ తరువాత సేఫ్‌ - కామారెడ్డి జిల్లాలో థ్రిల్లింగ్ ఘటన హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: రాజు వేటుకు వెళ్లి.. అని చదివి ఇది కల్పిత కథ అనుకోకండి. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో నిజంగా జరిగిన థ్రిల్లింగ్‌ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నారు. వేటకు వెళ్లిన ఓ వ్యక్తి భారీ బండరాళ్ల మద్య ఇరుక్కు పోయి నరక యాతన పడ్డాడు. అధికారులు దాదాపు 40 గంటల పాటు చేసిన రిస్క్యూ ఆపరేషన్‌ తరువాత సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డారు. వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన రాజు మంగళవారం వేటకు వెళ్లాడు. అక్కడ గుహలో కింద పడిపోయిన ఫోన్‌ తీసేందుకు యత్నించాడు. ఫోన్‌ను పట్టుకునే క్రమంలో మరింత లోతుకు వెళ్లిపోయాడు. ఎంత ప్రయత్నించినా రాజు బయటకు రాలేకపోయాడు. తనను కాపాడాలంటూ అరుపులు కేకలు వేశాడు. వెంట వెళ్లిన గ్రామస్తులు అతన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. రాజు ‌ వేటకు వెళ్లిన కారణంతో మొదట అధికారులకు సమాచారం ఇవ్వలేదు. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌ మాత్రమే నిన్న మధ్యాహ్నం వరకు ప్రయత్నించారు.. వీలుకాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్నిమాపక, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రాజును రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. జేసీబీల సాయంతో రాళ్లను తొలగిస్తున్నారు. పెద్ద పెద్ద రాళ్లను పేల్చివేస్తున్నారు. దాదాపు 40 గంటల తరువాత రాజు సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో రాజు వేటకు వెళ్లిన కథ సుఖాంతం అయ్యింది. తమ కుమారుడికి క్షేమంగా బయటకు తీసినందుకు కుటుంబ సభ్యులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.