schedule Saturday, July 04, 2026

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు

calendar_today December 16, 2022
person dharshininews
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు - బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆరోపణలపై జారీ - విచారణకు హాజర కావవాలని సారాంశం హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంలో కీలకంగా మారిన వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేరు మరోసారి సంచలనమైంది. బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆయనకు శుక్రవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ సంఘటన మరోసారి చర్చనీయాంశమైంది. బెంగళూరు డ్రగ్స్‌ కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో బెంగళూరు డ్రగ్స్ కేసు రాష్ట్రంలో కలకలం రేపింది. పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హస్తం ఇందులో ఉందనే వార్తలు కలకలం సృష్టించాయి. పలువురి ఎమ్మెల్యేలకు పోటీసులు నోటీసులు ఇచ్చినట్లు కూడా అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఈ మేరకు ఈనెల 19వతేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు అందజేసింది. మరుగున పడిపోయిన ఈ పాత కేసు ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడం సంచలనంగా మారింది.