schedule Sunday, July 05, 2026

స్కూల్‌ హెచ్‌ఎంపై చర్యలు తీసుకోండి

calendar_today December 21, 2022
person dharshininews
స్కూల్‌ హెచ్‌ఎంపై చర్యలు తీసుకోండి
స్కూల్‌ హెచ్‌ఎంపై చర్యలు తీసుకోండి - డీఈఓకు ఫిర్యాదు చేసిన కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పాఠశాలలో విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించి, నీళ్లు మోయించిన స్కూల్ హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారికి తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ ఫిర్యాదు చేశారు. తాండూరు పట్టణం గాంధీనగర్ లోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు మంజుల విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించడం, ట్యాంకులోకి నీళ్లు మోయించారని, చెత్త ఊడ్చిపించారని విద్యార్థుల తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకవచ్చారని తెలిపారు. కావున పాఠశాల హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని డీఈఓ రేణుకా దేవికి ఫిర్యాదు చేశారు. దీనిపై డీఈఓ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారని కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తెలిపారు.