schedule Saturday, July 04, 2026

అదుపు తప్పిన ఆర్మీ ట్రక్కు

calendar_today December 23, 2022
person dharshininews
అదుపు తప్పిన ఆర్మీ ట్రక్కు
అదుపు తప్పిన ఆర్మీ ట్రక్కు - లోతైనా లోయలో పడి ప్రమాదం - 16 మంది సైనికుల మృతి దర్శిని డెస్క్‌: భారతదేశం-చైనా సరిహద్దు సమీపంలోని భారత ఆర్మి ట్రక్కుకు ప్రమాదం జరిగింది. ఉత్తర సిక్కింలో సైనికులతో ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది సైనికులు మృతి చెందారు. శుక్రవారం ఉదయం సిక్కింలోని ఛటెన్ నుంచి తాంగు వైపు వెళ్తున్న కాన్వాయ్‌లో ఓ వాహనం మూలమలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడిపోయి నట్లు అధికారులు తెలిపారు. జెమా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. సీనియర్ పోలీసు అధికారి ప్రమాద ఘటనపై స్పందిస్తూ.. తమకు సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారని చెప్పారు. క్షతగాత్రులను ఉత్తర బెంగాల్‌లోని సైనిక ఆసుపత్రికి హెలికాప్టర్‌లో తరలించారు. ఈ ప్రమాదంలో 16 మంది సైనికులు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడినట్లు తెలిసింది. ఈ రోడ్డు ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఉత్తర సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయినందుకు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆర్మీ జవాన్ల సేవలు వారి నిబద్ధతకు దేశం ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు పెద్ద ఎత్తున సిబ్బంది మరణించడంపై ఆర్మీ విచారం వ్యక్తం చేసింది.. సైనికుల కుటుంబాలకు సంతాపం తెలియజేసింది. Deeply pained by the loss of lives of the Indian Army personnel due to a road accident in North Sikkim. The nation is deeply grateful for their service and commitment. My condolences to the bereaved families. Praying for the speedy recovery of those who are injured. — Rajnath Singh (@rajnathsingh) December 23, 2022