schedule Saturday, July 04, 2026

ఎమ్మెల్యే కృషితో కాలేజీకి మహర్దశ

calendar_today December 24, 2022
person dharshininews
ఎమ్మెల్యే కృషితో కాలేజీకి మహర్దశ
ఎమ్మెల్యే కృషితో కాలేజీకి మహర్దశ - జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ - కళాశాలకు నిధుల మంజూరుపై హర్షం - కేసీఆర్, ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కృషితో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మహర్ధశ రాబోతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. మంత్రి సబితా రెడ్డి సహాకారంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పట్టణంలోని జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం రూ. 2 కోట్లు నిధులు సాధించిన విషయం తెలిసిందే. కళాశాలకు నిధులు రావడం పట్ల బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శనివారం కళాశాలలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం- కట్టుబడి ఉందన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషితో కళాశాలలో అదనపు గదులు, మరుగుదొడ్లు ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు రూ. 2 కోట్లు మంజూరు చేయించారని అన్నారు. దశల వారిగా కళాశాల సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు కె.గోపాల్, బీఆర్ఎస్వీ తాండూరు ఇంచార్జ్ జిలాని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.