schedule Sunday, July 05, 2026

అట్టహాసంగా ముగిసిన క్రీడా పోటీలు

calendar_today December 24, 2022
person dharshininews
అట్టహాసంగా ముగిసిన క్రీడా పోటీలు
అట్టహాసంగా ముగిసిన క్రీడా పోటీలు - విజేతలకు బహుమతులు అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు తాండూరులో నిర్వహించిన క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ముగిశాయి. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఎన్ రెడ్డి, సెమ్స్ ఒలంపాడు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారెడ్డిలు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటమి గెలుపుకు నాంది అని అన్నారు. గెలిచిన విద్యార్థులు మరింత స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. చదువుతోపాటు విద్యార్థులు క్రీడలో చక్కగా రాణించాలని అందుకు పాఠశాల నిర్వాహకులు నిత్యం క్రీడలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ పాఠశాలల టీచర్లు, క్రీడకారులు తదితరులు పాల్గొన్నారు.