schedule Saturday, July 04, 2026

అమ్మకు కష్టం..!

calendar_today December 24, 2022
person dharshininews
అమ్మకు కష్టం..!
అమ్మకు కష్టం..! - రోడ్డుపై మహిళ ప్రసవం - హైదరాబాద్‌లో ఘటన - సాయం చేసిన స్థానికులు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : నిండు గర్భిణీగా ఉన్న ఆమె ఆటోలో.. ఇతర వాహనాల్లో వెళ్లలేని పరిస్థితి ఆమెది. దీంతో నడుచుకుంటూ వెళుతుండగానే రోడ్డుపైనే పురిటి నొప్పులు వచ్చాయి. నడిరోడ్డుపై ప్రసవ వేధన అనుభవించింది. అట్ట ముక్కల అడ్డుగోడల మద్య రోడ్డుపైనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ దయనీయ సంఘటన శనివారం హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన బబిత (గర్భిణి) ఇస్నాపూర్‌లో నివాసముంటోంది. శనివారం మధ్యాహ్నం నడుచుకుంటూ వెళ్తుండగా పురిటి నొప్పులు రావడంతో రామచంద్రాపురం అశోక్‌నగర్‌ కూడలి వద్ద రోదిస్తూ రోడ్డుపైనే కూర్చుండిపోయింది. పురిటి నొప్పులతో విలవిల్లాడుతున్న ఆమెను గమనించిన స్థానికులు సమీపంలో ఉన్న దుకాణాల నుంచి అట్టముక్కలు తెచ్చి అడ్డుగా పెట్టారు. కాసేపటికి ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమెను ఆటోలో పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె దయనీయ స్థితిని చూసి చలించిన ఓ వ్యక్తి కొంతమేర ఆర్థిక సాయం చేశారు.