schedule Sunday, July 05, 2026

మూడు రోజులకోసారి మిషన్‌..!

calendar_today January 1, 2023
person dharshininews
మూడు రోజులకోసారి మిషన్‌..!
మూడు రోజులకోసారి మిషన్‌..! - భగీరథ నీటి సరఫరాలో ఆటంకాలు - పోదుపుగా వాడుకోవాలని అధికారుల సూచన తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని పరిగి, తాండూరు ప్రాంతాల్లో మిషన్ భగరీథ నీటిసరఫరాలో అంతరాయాలు కలుగుతున్నాయని అధికారులు ప్రకటించారు. మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా ఉంటుందని తెలిపారు. జిల్లాలోని పరిగి సమీపంలో మిషన్‌ భగీరథ సాధారణ నిర్వహణ మరమ్మత్తుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 10వ తేది వరకు మూడు రోజులకు ఒకసాగి మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరా జరుగుతుందని వివరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, తాగునీరు సరఫరా రోజులను దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ అసౌకర్యానికి అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.