schedule Friday, September 18, 2026

ముగిసిన వైకుంఠ ఉత్సవాలు

calendar_today January 3, 2023
person dharshininews
ముగిసిన వైకుంఠ ఉత్సవాలు
ముగిసిన వైకుంఠ ఉత్సవాలు - దస్తగిరికి రెండో రోజు తరలివచ్చిన భక్తులు - స్వామికి పూజలో సీఐ రాజేందర్ రెడ్డి దంపతలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరులో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మండలంలోని అంతారం అనుబంధ గ్రామం దస్తగిరి పేట్‌లో వెలసిన శ్రీ వేంకటేశ్వర శ్రీదేవి, భూదేవి దేవాలయంలో రెండు రోజులుగా ఉత్సవాలు కన్నుల పండుగలా జరిగాయి. సోమవారం భక్తులకు ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పించారు. రెండో రోజు మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 4-15 గంటల నుంచే ఆలయంలో సతీసమేతంగా వెలసిన శ్రీ వేంకటేశ్వర శ్రీదేవి, భూదేవిలకు ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి దంపతులు ఆలయంలో స్వామి వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. మరోవైపు రెండో రోజు కూడ భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు. తెల్లవారు జామునుంచే భక్తుల తాకిడి పెరిగింది. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం వీరేందర్, కార్యదర్శి కోట మురళీకృష్ణ, గుముడాల సుధాకర్, గిట్టిల సుబ్బారావు, కుంచెం మురళీధర్, కోట్రిక కిరణ్ కుమార్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.