schedule Saturday, July 04, 2026

శభాష్.. మహిపాల్ రెడ్డి !

calendar_today January 7, 2023
person dharshininews
శభాష్.. మహిపాల్ రెడ్డి !
శభాష్.. మహిపాల్ రెడ్డి ! - చెరువులోకి దిగి శవాన్ని తీసిన తాండూరు ఎస్‌ఐ - ఎస్ఐ సాహసానికి పలువురి అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి: విధి నిర్వహణకు వయసు అడ్డు రాదని నిరూపించాడు ఓ ఎస్సై.. అనుమానాస్పదంగా చెరువులో లభించిన ఓ శవాన్ని తీయడానికి 59 ఏళ్ల వయసులో చెరువులోకి దిగి శవాన్ని వెలికి తీసీ శభాష్ అనిపించుకున్నాడు ఆ ఎస్సై. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా పాత తాండూరు పట్టణానికి చెందిన నజీర్ బేగ్ (52) ఈనెల 3 నుంచి ఇంటి నుంచి తప్పిపోయాడు. అతడి బంధువుల నుండి ఫిర్యాదు అందుకున్న తాండూరు పోలీసులు విచారణ చేపడుతన్నారు. ఈ క్రమంలో ఎస్‌ఐ మహిపాల్ రెడ్డికి తాండూరు పట్టణ శివారులోని మల్ రెడ్డి పల్లి చెరువులో వ్యక్తి మృతదేహం కనిపించిందని సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ మహిపాల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం నజీర్ బేగ్‌గా గుర్తించారు. అయితే శవాన్ని చెరువులో నుండి తీసేందుకు తోటి సిబ్బందితోపాటు స్థానికులు వెనుకడుగు వేయగా.. తానే రంగంలోకి దిగిన ఎస్సై మైపాల్ రెడ్డి తాడు సహాయంతో చెరువులోకి దిగి శవాన్ని బయటికి తీశాడు. 59 ఏళ్ల వయసులో కూడా ఎస్ఐ మహిపాల్ రెడ్డి తన డ్యూటీ లో భాగంగా చెరువులోకి దిగడం పట్ల పలువురి నుండి అభినందనలు అందుకున్నాడు.