schedule Saturday, July 04, 2026

ఉదయాన్నే.. టీ..కీ బదులుగా..!

calendar_today January 16, 2023
person dharshininews
ఉదయాన్నే.. టీ..కీ బదులుగా..!
ఉదయాన్నే.. టీ..కీ బదులుగా..! - వీటిని తీసుకుంటే ప్రయోజనాలు - మీరు పాటిస్తే ఆరోగ్య యోగమే దర్శిని డెస్క్‌: ప్రతి రోజు అందరు ఉదయాన్నే ఒక కప్పు టీ తో రోజును ప్రారంభిస్తారు. చాలామందికి ఇది అలవాటుగా మారిపోయింది. ఒక్కరోజు టీ తాగకుండా ఉండలేరు. లేదంటే తలనొప్పి మొదలవుతుంది. అయితే రోజూ ఉదయాన్నే టీ.. కీ బదులుగా పోషకాహార పదార్థాలు, పండ్లు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వాటితో రోజు ప్రారంభిస్తే ఆరోగ్య యోగాన్ని అందుకుంటారని పేర్కొంటున్నారు. నానబెట్టిన బాదం, నానబెట్టిన ఎండుద్రాక్ష, అరటిపండ్ల వంటివి తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని, వాటిని ఏ విధంగా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. బాదం: ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం, పీసీఓడీ లేదా నిద్రలేమి సమస్య ఉన్నవారు రోజూ కనీసం 4 నుంచి 5 నానబెట్టిన బాదంపప్పులను తినాలి. మంచి ఫలితాలు ఉంటాయి. కాని బాదం నీరు తాగొద్దు. ఇది గుర్తించుకోవాలి. ఎండు ద్రాక్ష: ప్రతిరోజూ కనీసం 6 నుంచి 7 నానబెట్టిన ఎండుద్రాక్షలను తినాలని నిపుణులు చెబుతున్నారు. పీసీఓఎస్, పీరియడ్స్‌ సమస్యలు ఉన్న మహిళలు రెండు కుంకుమపువ్వుతో పాటు ఎండు ద్రాక్షలను నానబెట్టి తిని ఆ నీటిని తాగాలి. అరటిపండు: జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు లేదా చక్కెర కోరికలతో సతమతమయ్యేవారు అల్పాహారానికి ముందు అరటిపండు తినాలి. వారానికి 2 నుంచి 3 సార్లు తినాలి. వీటిని ప్లాస్టిక్ సంచుల్లో తీసుకురావద్దు. మీరు టీకి అలవాటు పడినట్లయితే అల్పాహారానికి 15 నిమిషాల ముందు వీటిని తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని తిన్న 15 నుంచి 20 నిమిషాల తర్వాత శారీరక శ్రమ చేయాలి. అరటిపండ్లు ఇష్టం లేకుంటే సీజనల్ ఫ్రూట్స్ తినాలని సూచిస్తున్నారు.