schedule Friday, September 18, 2026

అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా రవీందర్ రెడ్డి

calendar_today January 18, 2023
person dharshininews
అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా రవీందర్ రెడ్డి
అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా రవీందర్ రెడ్డి - తాండూరు న్యాయస్థానంలో పదవి - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం - హర్షం వ్యక్తం చేసిన బార్ అసోసియషన్, న్యాయవాదులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా న్యాయవాది రవీందర్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాండూరులోని సివిల్ కేసులను ప్రభుత్వం తరుపున వాధించేందుకు ప్రభుత్వం అసిస్టెంట్ గవర్నమెంట్ సీడర్లను నియమిస్తుంది. దీంతో తాండూరుకు చెందిన న్యాయవాది రవీందర్ రెడ్డిని జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో అసి స్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమించింది. పదవి చేపట్టిన నాటి నుంచి మూడు సంవత్సరాల పాటు లేదా అతని సేవలు ముగిసే వరకు పదవి కాలం అమలలో ఉంటుందని ఉత్తర్వులలో స్పష్టం చేసింది. అంతేకాకుండా నెలకు రూ. 20వేల ఏకీకృత గౌరవ వేతనం చెల్లిస్తుందని వెల్లడించింది. మరోవైపు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు తనను అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమించడం పట్ల రవీందర్ రెడ్డి ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా సీనియర్ న్యాయవాదులు రాంరెడ్డి, గోపాల్ లకు కృతజ్ఞతలు రవీందర్ రెడ్డి అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియామకం కావడం పట్ల తాండూరు భార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.