schedule Friday, September 18, 2026

శ్రీ సాయి మేధలో వైభవంగా అక్షరాభ్యాసం

calendar_today January 26, 2023
person dharshininews
శ్రీ సాయి మేధలో వైభవంగా అక్షరాభ్యాసం
శ్రీ సాయి మేధలో వైభవంగా అక్షరాభ్యాసం - ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు - గణతంత్ర దినోత్సవ వేడుకలు అదుర్స్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం శివాజీ చౌక్ సమీపంలోని శ్రీ సాయి మేధా విద్యాలయంలో సామూహిక అక్షరాభ్యాస వేడుకలు వైభవంగా జరిగాయి. గురువారం వసంతపంచమిని పురస్కరించుకొని పాఠశాలలో కరస్పాండెంట్ పెరుమాళ్ళ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సామూహిక అక్షరభ్యాస కార్యక్రమము అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచరణాల మధ్య 142 మంది విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసంలో చదువుకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు రిపబ్లిక్ డే సందర్భంగా కరస్పాండెంట్ పి.వెంకట్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు హాజరైన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గస్థాయిలో నిర్వహించిన డ్రాయింగ్ పోటీలో మొదటి బహుమతి సాధించిన స్వప్నకు రూ.2వేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా యు.రమేష్ కుమార్, ప్రశాంత్ కుమార్, శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించిన భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలు సాయి మేధలో నేర్పించడం చాలా సంతోషదాయకమని అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సాహు శ్రీలత, లావణ్య, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.