schedule Saturday, July 04, 2026

ఐఏఎస్ అధికారులకు స్థానచలనం

calendar_today January 31, 2023
person dharshininews
ఐఏఎస్ అధికారులకు స్థానచలనం
ఐఏఎస్ అధికారులకు స్థానచలనం - బదిలీ ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం - ఎవరెవరిని ఎక్కడెక్కడికి బదిలీ చేశారంటే హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది. 15 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు వెలువరించారు. ఇందులో మంచిర్యాల కలెక్టర్‌ భారతి హొళికెరిని మహిళా శిశు సంక్షేమశాఖ స్పెషల్‌ సెక్రెటరీగా నియమించింది. హన్మకొండ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతును నిజామాబాద్‌కు బదిలీ చేసింది. అమయ్‌కుమార్‌ను మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ను హన్మకొండకు, కుమ్రంభీం కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ను ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా పంపింది. నారాయణరెడ్డిని వికారాబాద్‌ కలెక్టర్‌గా, వనపర్తి కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషాను కుమ్రంభీం ఆసిఫాబాద్‌కు, మెదక్‌ కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావును సూర్యాపేట కలెక్టర్‌గా, ఎస్‌ హరీశ్‌రాను రంగారెడ్డి, రాజశ్రీ షాను మెదక్‌ కలెక్టర్‌గా నియమించింది. మహబూబ్‌నగర్‌ అడిషనల్‌ కలెక్టర్‌ తేజ ఎస్‌ పవార్‌ వనపర్తి కలెక్టర్‌గా, ఉట్నూరు ఐటీడీఏ పీవో క్రాంతి వరుణ్‌రెడ్డి నిర్మల్‌ కలెక్టర్‌గా, కరీంనగర్‌ కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌కు జగిత్యాల కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.