schedule Saturday, July 04, 2026

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

calendar_today February 1, 2023
person dharshininews
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
ఇసుక ట్రాక్టర్ పట్టివేత - డ్రైవర్, యజమానిపై కేసు - వివరాలు వెల్లడించిన పోలీసులు తాండూరు, దర్శినిప్రతినిధి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. మున్సిపల్ పరిధిలోని పాత తాండూరుకు చెందిన సయ్యత్ సికిందర్ బుధవారం తెల్లవారు జామున తాండూరు మండలం ఖాంజాపూర్ వాగు నుంచి ట్రాక్టర్( TS 34 TR 6905, ట్రాలీ number AP 27 G 4646) ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడు. వాగు నుంచి తీసుకవచ్చిన ఇసుకను పట్టణంలోని సాయిపూర్ కాలనీలో అన్‌లోడ్‌ చేసి తీసుకవస్తుండగా పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతులు, పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్‌ను పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు ట్రాక్టర్ యజమాని, డ్రైవర్‌ అయిన సయ్యద్ సికిందర్‌పై కేసు నమోదు చేసి ట్రాక్టర్ సీజ్ చేయడం జరిగిందని పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే పోలీసులకు పట్టుబడిన ఇసుక ట్రాక్టర్ జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజు కూడ యేధేచ్చగా.. దర్జాగా అక్రమ ఇసుక రవాణా సాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.