schedule Saturday, July 04, 2026

సమగ్ర పాలన అందించడమే ధ్యేయం

calendar_today February 2, 2023
person dharshininews
సమగ్ర పాలన అందించడమే ధ్యేయం
సమగ్ర పాలన అందించడమే ధ్యేయం - సంక్షేమ పథకాలు అందరికి అందేలా చర్యలు - వికారాబాద్ కలెక్టర్ గా నారాయణ రెడ్డి బాధ్యతలు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : జిల్లా ప్రజలకు సమగ్ర పాలన అందించడం ధ్యేయం అని వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. గురువారం అయన వికారాబాద్ జిల్లా కొత్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ కలెక్టర్ గా విధులు నిర్వహించిన కె. నిఖిల బదిలీ అయిన విషయం తేలిసిందే. ఆమె స్థానంలో బదిలీపై వచ్చిన నారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ చేరే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఇందుకోసం జిల్లా ప్రజలు అధికారులు అందరూ సహకరించాలని సూచించారు. రానున్న రోజుల్లో ఎన్నికలు జరిగేవి ఉన్నందున సమగ్రంగా పాలన సాగించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు జిల్లా అధికారులు కొత్త కలెక్టర్ కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. బాధ్యతల అనంతరం శాలువాలతో సత్కరించారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు.