schedule Tuesday, September 08, 2026

వేర్వేరుగా అందించడం అలవాటు చేసుకోవాలి

calendar_today February 6, 2023
person dharshininews
వేర్వేరుగా అందించడం అలవాటు చేసుకోవాలి
వేర్వేరుగా అందించడం అలవాటు చేసుకోవాలి - తడి చెత్త, పొడి చెత్త సేకరణపై అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలు తడి చెత్తను, పొడి చెత్తను వేరు వేరుగా అందించడం అలవాటు చేసుకోవాలని తాండూరు మున్సిపల్ అధికారులు సూచించారు. సోమవారం తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో తడిచెత్త, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించారు. వార్డు కౌన్సిలర్ బోయ రవి రాజు సమక్షంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, టీఎంసీ సరిత, ఎన్వీరాల్ మెంట్ ఇంజనీర్ ప్రవీణ్‌లు ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు వేరుగా అందించడంలో పారిశుద్ధ్యం మెరుగు పడడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. ఎలా వేరు చేసి అందించాలో వివరించారు. కావున ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను వేరు వేరుగా అందించడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. చెత్తను మున్సిపల్ వాహనాలకు అందించాలన్నారు. దీంతో పాటు సింగల్ యూస్డ్ ప్లాస్టిక్ వాడకంపై కూడ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీలు, వార్డు మహిళలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.