schedule Sunday, September 06, 2026

మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం..!

calendar_today September 7, 2021
person dharshininews
మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం..!
మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం..! - బీసీ సంక్షేమ సంఘం తాండూరు క‌న్విన‌ర్ రాజ్ కుమార్ కందుకూరి తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : మ‌ట్టి వినాయ‌కుల‌ను పూజించి ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుదామ‌ని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజ‌క‌వ‌ర్గ క‌న్విన‌ర్ కందుకూరి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. వ‌చ్చే వినాయ‌య చ‌వితి ఉత్స‌వాల్లో ర‌సాయ‌న‌తో త‌యారు చేసిన వినాయ‌కుల‌ను ప్ర‌తిష్టించ‌రాద‌న్నారు. గత రెండు సంవత్సరాల నుండి కరోనా వైరస్ కారణంగా ఆక్సిజన్ విలువ ఏంటో మనకు తెలిసింద‌న్నారు. ప్రపంచంలోనే ఆసియా ఖండంలో భారతదేశం రెండవ అతిపెద్ద కాలుష్య దేశంగా తయారవడానికి సిద్ధంగా ఉందని, భావితరాలకు మనం ఆరోగ్యాన్నిచ్చే ఆక్సిజన్ ను పంచాలి అంటే కాలుష్య రహిత మైన మట్టి వినాయకులను పూజించాల‌న్నారు. మట్టి వినాయకులను పూజించడం ద్వారా కుల వృత్తుల వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మనం ఆర్థిక సహాయం అందించిన వార‌మ‌వుమ‌తామ‌న్నారు. అంతేకాకుండా వారి కుటుంబానికి చేయూత కల్పించినట్లు అవుతుంద‌ని అన్నారు. కుల వృత్తుల వారికి చేయూతనిస్తూ మట్టి గణపతిని పూజించి.. పర్యావరణాన్ని కాపాడుదామ‌ని విజ్ఞ‌ప్తి చేశారు.