schedule Saturday, July 04, 2026

తాండూరు ప్రజలకు శుభవార్త

calendar_today March 7, 2023
person dharshininews
తాండూరు ప్రజలకు శుభవార్త
తాండూరు ప్రజలకు శుభవార్త - ఈనెల 13న మెగా క్యాన్సర్ నిర్ధారణ శిభిరం - ఉచితంగా అత్యాధునిక పరికరాలతో పరీక్షలు - బాలాజీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహణ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం, పరిసర ప్రాంతాల ప్రజలకు స్థానిక బాలాజీ మల్టీ స్పెషాలిటీ నర్సింగ్‌ హోమ్ ఆసుపత్రి యజమాన్యం శుభవార్త చెప్పింది. ఈనెల 13న తాండూరులో ఉచిత మెగా క్యానర్స్ నిర్ధారణ పరీక్ష శిబిరం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. బాలాజీ ఆసుపత్రి అధినేత డాక్టర్ సంపత్ కుమార్, ప్రముఖ వ్యాపార వేత్త కల్వ సుధాకర్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పరీక్ష శిబిరాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 13వ తేది తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి పరీక్ష శిబిరం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రముఖ వైద్యులు, అత్యాధునిక వైద్య పరీక్షలతో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, పేదలు ఈ అవకాశన్నా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.